- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ కు ఏమాత్రం నైతికత ఉన్నా సీబీఐకి సహకరించాలి.. ఉమామహేశ్వర నాయుడు
దిశ, కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతికత ఉన్న వెంటనే రాజీనామా చేసి ఆయన, ఆయన భార్య భారతి సీబీఐ విచారణకు హాజరు కావాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో జగనాసుర రక్త చరిత్ర గోడపత్రికలను ఇతర నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ.. జగన్ బాబాయిని హత్య చేసిన విషయంలో లేనిపోని రాద్ధాంతం చేసి చంద్రబాబు నాయుడు కుటుంబంపై నిందలు వేసి సానుభూతి పొంది ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారన్నారు.
ప్రస్తుతం వివేకానందా రెడ్డి కూతురు అభ్యర్థనతో పక్క రాష్ట్రానికి కేసు మారడంతో రాష్ట్రంలో అందరి వేళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైపు చూపుతున్నాయని, ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేసి సీబీఐ విచారణకు సహకరించాలని ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..