- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలాంటి కేసులనైనా ఎదుర్కుంటా.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: 'సనాతన ధర్మాన్ని నిర్మూలించండి' అంటూ తన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. పెరియార్, అన్నా, కలైంజర్, పెరసిరియార్ సిద్ధాంతాల విజయం కోసం కృషి చేయాలని, సామాజిక న్యాయం కలకాలం వర్ధిల్లాలని ఉదయనిధి స్టాలిన్ ఇవాళ ట్వీట్ చేశారు. పార్టీ అధ్యక్షుడి మార్గదర్శకత్వంతో, తమ పార్టీ హైకమాండ్ సలహా మేరకు తనపై నమోదైన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని స్టాలిన్ పేర్కొన్నారు.
మణిపూర్ లాంటి అతి పెద్ద సమస్యను వదిలేసి తన వ్యాఖ్యలతో రాజకీయం చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేయవద్దని శ్రేణులకు సూచించారు. తనపై విమర్శలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, వాళ్ల దిష్టిబొమ్మలు తగలబెట్టడం లాంటివి చేయవద్దని డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.