PM Narendra Modi: రాజ్ భవన్ నుండి వేములవాడకు పయనమైన ప్రధాని.. షెడ్యూల్ ఇదే..

by Indraja |   ( Updated:2024-05-08 14:40:34.0  )
PM Narendra Modi: రాజ్ భవన్ నుండి వేములవాడకు పయనమైన ప్రధాని.. షెడ్యూల్ ఇదే..
X

దిశ వెబ్ డెస్క్: అటు సార్వత్రిక ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. కాగా మరో ఐదు రోజుల్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు, ఏపీలో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ప్రధాని మోడీ రెండు తెలుగు రాష్ట్రాలను సంధర్శించనున్నారు. మొదటగా తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

కాగా ప్రస్తుతం మోడీ రాజ్ భవన్ నుండి బయలు దేరారు. మరి కాసేపట్లో వేములవాడకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు.అక్కడ వేములవాడ రాజన్నను ధర్శించుకోనున్నారు. అనంతరం వేములవాలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత వరంగల్‌కు వెళ్ళనున్నారు. కాగా ఈ రోజు ఉదయం 11.30 గంటలకు వరంగల్‌‌లోని మడికొండ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

ఆ తరువాత ఏపీకి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఇక ప్రధాని మోడీ ఏపీ షెడ్యూల్ విషయానికి వస్తే ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. అక్కడ నుండి బయలుదేరి హెలికాప్టర్‌లో రాజంపేటలోని కలికిరికి ప్రధాని మోడీ వెళ్ళనున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కలికిరిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు.

అనంతరం సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. అలానే సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఇక బందర్‌ రోడ్డు మార్గంలో ప్రయాణించి రాత్రి 7 గంటలకు ఇందిరా గాంధీ స్టేడియానికి మోడీ చేరుకుంటారు. అనంతరం స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు నిర్వహించనున్న రోడ్‌ షోలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.


Read More...

ఏ రోజూ సెలవు తీసుకోలేదు.. కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed