- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేషనల్ హైవే పై దారి దోపిడీ..
దిశ, పెబ్బేరు : వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న మూత్రశాలల వద్ద ఆగి ఉన్న వెహికిల్ పై గుర్తుతెలియని దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేసి 14 తులాల బంగారం చోరీ చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కూజన్ కొత్తూరు గ్రామానికి చెందిన 3 కుటుంబాలకు చెందిన 8 మంది తిరుపతి, అరుణాచలం తదితర తీర్ధయాత్రలకు వెళ్లి తిరిగివస్తున్నారు. ప్రయాణం చేసి అలసిపోగా నిద్రపోదామని పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న భారీ వాహనాలు నిలిపే స్థలంలో కారుని ఆపారు. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు అకస్మాత్తుగా కత్తులు, రాళ్లతో దాడి చేసి వెహికిల్లో ఉన్న 8 మంది వద్ద 14 తులాల బంగారం చోరీ చేశారు.
వెహికిల్ టాప్ పైన ఉన్న బ్యాగులను ఎత్తుకెళ్లారు. బండిలో ఉన్న మగవారు దుండగుల పై ప్రతి దాడి చేయగా వారు రాళ్ళతో దాడిచేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ఘటన జరిగింది. వెంటనే బాధితులు 100 కు డయల్ చేయగా స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా మహిళలకు మెడల పై గాట్లు పడి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, సీఐ రాంబాబు, ఎస్సై హరిప్రసాద్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ వారు రక్తపు మరకలు, వేలిముద్రలు వంటి వివరాలను సేకరించారు.