- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lavanya Tripathi: నిహారిక బర్త్ డే సందర్భంగా లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
దిశ, వెబ్‌డెస్క్: నేడు మెగా డాటర్ నిహారిక కొణిదెల(Mega daughter Niharika Konidela) పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వదిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇన్‌స్టాగ్రామ్ వేదిక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టింది. ‘నా అపురూపమైన కోడలు ఆడపడుచు నిహారికకు జన్మదిన శుభాకాంక్షలు. నీ మనసు బంగారం. ప్రతి క్షణాన్ని వేడుకగా మార్చే శక్తి నీలో ఉంది. మీ సంవత్సరం మీలాగే ఉత్సాహంగా, ఆనందంగా.. అద్భుతంగా ఉండాలి. ఎల్లప్పుడూ నీవు హ్యీపీగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ లొట్ట చెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.. మెగా డాటర్‌కు విష్ చేసింది.
ఇక నిహారిక బుల్లితెరపై ఢీ జూనియర్స్(Dhee Juniors)లో యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. తర్వాత హీరో నాగశౌర్య(Naga Shaurya) సరసన ఒక మనసు సినిమాలో అవకాశం దక్కించుకుంది. నాన్న నాగబాబు(Naga Babu)తో కలిసి నాన్నకూచి సిరీస్ కూడా చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది. అవకాయ్(Avakay), డెడ్ పిక్సెల్స్(Dead pixels) వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించింది. అంతేకాకుండా సూర్యాకాంతం(Suryakantam), హ్యాపీ వెడ్డింగ్(Happy wedding) వంటి చిత్రాల్లో కూడా చాన్స్ కొట్టేసి.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు నిర్మాతగా మారి.. కమిటీ కుర్రాళ్లు(Committee kurrallu) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవ్వడంతో నిహారిక మొదటి సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నేడు ఈ అమ్మడు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనుంది.