సీఎం జగన్‌కు పొంచి ఉన్న ప్రమాదం ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీనియర్ నేత

by Indraja |
సీఎం జగన్‌కు పొంచి ఉన్న ప్రమాదం ఇదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీనియర్ నేత
X

దిశ వెబ్ డెస్క్: జగన్ ప్రమాదంలో ఉన్నారన్న పొన్నవోలు వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్టంరాజు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రమాదంలో ఉన్నారంటే.. ఇన్నాళ్లు అధికారమదంతో జగన్ తనతోపాటు అందరినీ ప్రమాదంలో పెట్టారు, ఇప్పుడు అధికారంపోతోంది కాబట్టి ఖచ్చితంగా అతను చేసిన పాపాలు అతన్ని చుట్టుముడతాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.

కాబట్టి జగన్ పెను ప్రమాదంలో ఉన్నారని పొన్నవోలు ఎడుస్తూ చెప్పారని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆయనకు ఉద్యోగం పోతోంది ఫస్ట్, కచ్చితంగా అదే ఆయన బాధ అని అన్నారు. జగన్ కొన్నివందల వేల పాపాలు చేశారని, కనుక పైకి వెళ్లాక ఎక్కడో యమలోకంలో శిక్ష ఉంటుందని తాను అనడం లేదని అన్నారు. అధికారం పోయిన తరువాత అధికార దర్పంతో అతను చేసిన నేరాలకు ఇక్కడే జగన్‌కి శక్ష ఉంటుందని రఘురామకృష్టంరాజు పేర్కొన్నారు.

అందుకే గతంలో సేవ్ చేస్తారు అని అనుకున్నవాళ్లు ఇప్పుడు సేవ్ చేయరేమోనని, ఎవరు మనవాడో, ఎవరు పరాయివాడో తెలియడం లేదని కళాకారుడు ఏడుస్తూ అన్నాడని పొన్నవోలుని ఎద్దేవా చేశారు. జగన్ అంతానికి ఆరంభం మొదలయ్యిందని అడ్వకేట్ పొన్నవోలు స్పష్టం చేశారని అన్నారు. పేదవాడి కోసం జగన్ పని చేస్తున్నారని అనడం జోక్ ఆఫ్ ది మిలీనీయం అని, అందుకే ఆయన పక్కన ఉన్నవాళ్లు నవ్వుతున్నారు అని ఎద్దేవ చేశారు.

మరీ ఇంత యాక్షన్ ఏట్రా బాబు, నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జునా నీకు అవార్డు ఇవ్వరు అన్నట్టుగా, అతని యాక్షన్ చూసి పక్కన ఉన్నవాళ్లే నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. అతను డ్రామా ఆడుతున్నారని, అలానే జగన్‌కు పేదలంటే చాలా అసహ్యం అని, జగన్ అంత దనవంతుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ లేరని అందరికీ తెలుసని రఘురామకృష్టంరాజు తెలిపారు.

అలాంటప్పుడు ఈ రెడ్డి లండన్ వెళ్లి అక్కడ జగన్ గురించి పూర్తిగా తెలిసిన మరికొంతమంది రెడ్డిలతో కలిసి డ్రామా ఆడాల్సిన అవసరం ఏముందో తనకైతే అర్థం కాలేదని అన్నారు. జగన్ ఎన్నిలక్షల కోట్లు దోచింది, దాచింది అక్కడ ఉన్నవాళ్లకు సైతం తెలుసని, కాని కేవలం కుల ప్రాతిపదికన మద్దతిస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed