- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP vs MLA: మీ కొడుకు ఫ్లెక్సీలు కడితే ఊరుకునేది లేదు.. సంచలనం రేపుతున్న ఆడియో లీక్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వరుస వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంతో వార్తలల్లో ఉంటున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో ఫోన్ లో మాట్లాడిన వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. ఎంపీ రాములు తనయుడు భరత్ ప్రసాద్ రిజర్వు స్థానం అయిన నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని తీవ్రయత్నాలు చేశాడు. అందుకు ఎంపీ రాములు సైతం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆ పదవి అనూహ్యంగా అప్పట్లో మహిళా జడ్పీటీసీకి కట్టబెట్టారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ముగ్గురు సంతానం ఉన్న కారణంగా ఆ జడ్పీటీసీ సభ్యత్వం రద్దు కావడంతో పాటు, జడ్పీ చైర్మన్ పదవి కూడా ఈ మధ్య కోల్పోయింది.
ఇప్పుడైనా తనకు పదవి లభించకపోతుందా అని భరత్ ప్రసాద్ ఆశించాడు. కానీ ఆ పదవి భరత్ ప్రసాద్ కు దక్కకుండా పోయిన విషయం పాఠకులకు విధితమే. భరత్ కు పదవి దక్కకుండా చేయడంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రధాన పాత్ర పోషించాడు అని ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ ప్రసాద్ పలు సందర్భాలలో ఆరోపించారు. తమను రాజకీయంగా దెబ్బతీస్తున్న గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చంపేటలో ఇటీవల ఎంపీ రాములు, ఆయన కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ అయిన భరత్ ప్రసాద్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భాలలో ఎంపీ, ఆయన తనయుడు పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి.
వీటిలో కొన్ని ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కూడా ఎంపీ రాములు, భరత్ ప్రసాద్ అభిమానుల పేర్లతో ఫ్లెక్సీలు వెలువడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అక్రోశాన్ని వ్యక్తపరిచారు. నేరుగా ఎంపీ రాములు కు ఫోన్ చేసి ‘కాబోయే ఎమ్మెల్యే, ఎంపీ అంటూ మీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తగదు.. వాటిని వెంటనే తొలగించాలి’ అని గువ్వల బాలరాజు అన్నారు. దీనికి ఎంపీ రాములు కల్పించుకొని ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది.. ఎవరు ప్లెక్సీలు వారు కట్టుకోవచ్చు.. అని చెప్పడంతో అలా ఉండదు.. అని గువ్వల అన్నారు.. ఎన్నికలకు మరో ఏడు ఎనిమిది నెలల సమయం ఉంది..
అప్పుడు ఎవరు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి ఎవరో తేలుతుంది.. అప్పటివరకు మీ కొడుకు ఫ్లెక్సీలు ఉండడానికి వీలు లేదు అని ఎమ్మెల్యే చెప్పారు.. దీనితో ఎంపీ నీవు పార్టీ... నేను పార్టీనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం... అప్పుడు అక్కడ ఏం చెప్తే అది చేద్దాం అని అన్నారు.. అధిష్టానం సంగతి అటు ఉంచు... ముందు నాకున్న అధికారాలను ఉపయోగిస్తా అని చెప్పుకొచ్చారు.. మా ఎంపీ కొడుకుని కూడా చూడకుండా అధికారం దక్కకుండా చేశావు అని ఎంపీ రాములు అనగా.. ఇంకా చేస్తాను.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రికార్డు చేసుకుని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ.. ఎమ్మెల్యే గువ్వల చేసిన వ్యాఖ్యానాలు పార్టీ వర్గాలలో సంచలనం రేపుతున్నాయి.
ఆడియో కోసం ఇక్కడి క్లిక్ చేయండి: