- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాంధీ భవన్ వద్ధ ఉద్రిక్తత.. టీఎస్సీఎస్సీ వైపు దూసుకువచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీలో వెలుగు చూసిన అక్రమాలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు శ్రేణులు పిలుపునిచ్చిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కమిషన్ లోని అక్రమాలను బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల హరి గోస పేరుతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు శుక్రవారం గాంధీ భవన్ వద్ద దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎన్ఎస్ యూఐ శ్రేణులు రోడ్డు దూసుకువచ్చారు. దీంతో వారిని గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు అడ్డుకున్నప్పటికీ గాంధీ భవన్ గేట్ ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపైకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు యూత్ కాంగ్రెస్ మధ్య తోపులాట జరిగి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు.