ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఇవే..!

by Javid Pasha |   ( Updated:2023-04-10 16:41:20.0  )
ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఎన్సీపీ, టీఎంసీ, సీపీఐ పార్టీలు జాతీయ హోదాను కోల్పోగా.. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. కాగా ప్రస్తుతం దేశంలో 6 మాత్రమే జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఇవే.

1. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)

2. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (కాంగ్రెస్)

3. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)

4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం)

5. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)

6. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)

జాతీయ పార్టీకి ఉండాల్సిన అర్హతలు

జాతీయ పార్టీగా అర్హత సాధించాలంటే ఏ రాజకీయ పార్టైనా ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. లేదంటే ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అసెంబ్లీ గానీ లేక ఎంపీ ఎన్నికల్లో చెల్లుబాటైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి కనీసం 6 శాతం ఓట్లు రావాలి. ఇక లోక్ సభలో కనీసం నలుగురు ఎంపీలు ఉండాలి. లేదంటే కనీసం మూడు రాష్ట్రాల్లో 2 శాతం ఎంపీ సీట్లైనా వచ్చి ఉండాలి.

Advertisement

Next Story