- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: బెట్టింగ్ మార్కెట్‌లోనూ విజేతగా నిలిచిన కూటమి..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సర్వేల్లోనే కాదు, అంతకంటే ప్రామాణికంగా భావించే, వేల కోట్ల బెట్టింగ్ మార్కెట్ కూడా ఆంద్రప్రదేశ్‌లో కూటమికే జై కొడుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తిరిగి అధికారం వస్తుందన్న అంచనాలతో ప్రారంభమైన బెట్టింగ్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. మరో వారం రోజులలలో ఆంధ్రాలో పోలింగ్ జరుగనున్న సమయంలో బెట్టింగ్ అడేవారంతా ఇప్పుడు దీనిపైనే ద్రుష్టి సారించారు.
తాజా వైసీపీ సీట్ల సంఖ్య 71 నో..74 ఎస్
మే ఐదవ తేదీ నుండి బెట్టింగ్ మార్కెట్‌లో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య 71 కూడా రావని, 74 దాటుతాయనే అంశంపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. 71 సీట్ల సంఖ్య వద్ద నో అని, 74 సంఖ్య వద్ద ఎస్ అని పందెం కాయాల్సి వుంటుంది. అనుకొన్న మొత్తాన్ని కోడ్ చేసి బెట్టింగ్ సైట్‌లో పందెం కాయాలి. వారు సూచించిన ఎక్కౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేసి ఆతరువాత జనరేట్ అయ్యే కోడ్ ద్వారా బెట్టింగ్‌లో పాల్గొన్నాల్సివుంటుంది.
నెల రోజుల క్రితం వైసీపీ 86 నో..90 ఎస్
ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకాకముందు బెట్టింగ్ మార్కెట్‌లో వైసీపీకి పోటాపోటి మెజారిటీతో అధికారం వస్తుందన్న అంచనాలతో బెట్టింగ్ మార్కెట్ ఓపెన్ అయింది. అప్పుడు వైసీపీకి 86 సీట్లు రావని, 90 సీట్లు దాటుతాయని పందాలు సాగాయి. రెండు వారాల తరువాత ఆ సంఖ్య 81-85కి తగ్గింది. అది ఇంకా తగ్గిపోయి 71-74 సీట్లకు చేరింది.
కేంద్రంలో బీజేపీకి 303 సీట్లు ఎస్ అంటూ పందాలు
కేంద్రంలో తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న బెట్టింగ్ మార్కెట్ ఆ పార్టీకి 300 సీట్లు దాటతాయని అంచనావేస్తుంది. అయితే, పార్టీ నేతలు చెబుతున్నట్టు బీజేపీకి 350 సీట్లు ఎన్డీఏ కూటమికి 400 వస్తాయని ఆ మార్కెట్ నమ్మడం లేదు. ప్రస్తుతం బీజేపీకి 303 సీట్లపై పందాలు జరుగుతున్నాయి.
Read More..
దేశం గర్వంచే విషయంలో బిగ్ షాక్... సీఎం జగన్‌పై అమిత్ షా షాకింగ్ కామెంట్స్