- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందరికీ షాకిచ్చిన కొణతాల.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలోకి..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అందరినీ ఆశ్చర్యపరుస్తూ జనసేన అనకాపల్లి సీటు సాధించారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి జాబితాలో కొణతాల రామకృష్ణ పేరు చోటుచేసుకోవడం జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులను ఆశ్చర్యపరచింది. ఇటీవలే జనసేన తీర్థం పుచ్చకున్న ఆయన జనసేనకు సంబంధించిన సమావేశాలలో కూడా పెద్దగా పాల్గొనలేదు. గతంలో ఆయన ఎంపీగా పనిచేసినందున అనకాపల్లి ఎంపీగానే తిరిగి పోటీ చేస్తారని భావించారు. అయితే, అందుకు భిన్నంగా అనకాపల్లి శాసనసభ్యుడిగా ఆయన పోటీకి దిగుతున్నారని పవన్ ప్రకటించారు.
అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పర్యటించిన జనసేన నేత నాగబాబు ఆయన సమావేశాలకు కొణతాలను ఆహ్వానించకపోవడంతో ఇటీవల విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. ఆ చర్చల సారాంశం కూడా బయటకు రాలేదు. గతంలో కొణతాల 2004లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికై రాష్ర్ట వాణిజ్య పన్నుల శాఖామంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2009 ఎన్నికలలో ఓటమి చెందిన ఆయన 2014, 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు.