లోకేశ్ ర్యాగింగ్ మామూలుగా లేదు

by Javid Pasha |
లోకేశ్ ర్యాగింగ్ మామూలుగా లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : యువ‌గ‌ళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్‌ కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్‌ని ఎద్దేవ చేసేలా టీడీపీ హ‌యాంలో వ‌చ్చిన కంపెనీలు, తెచ్చిన సంస్థల ముందు లోకేశ్ సెల్ఫీలు దిగుతున్న సంగతి తెలిసిందే.సెల్ఫీలు దిగుతూ ‘మేము తెచ్చిన‌వి ఇవి, నువ్వు ఏమి తెచ్చావు జ‌గ‌న్’ అంటూ సెటైరికల్‌గా ప్రశ్నిస్తున్నారు లోకేశ్. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో మంగ‌ళ‌వారం పాద‌యాత్రగా వెళుతూ ఐతేప‌ల్లి వ‌ద్ద కాండోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు లోకేశ్ సెల్ఫీ దిగారు. డైబ్బయి ఏళ్లకి పైగా చ‌రిత్రగ‌లిగిన ప్రఖ్యాత విద్యా సంస్థ కాండోర్ టీడీపీ హ‌యాంలోనే ఏర్పాటైంది.

ఈ సంస్థకి అప్పట్లో చంద్రబాబు స‌ర్కారు 8 ఎక‌రాల భూమి కేటాయించింది. ఇప్పటివ‌ర‌కూ టీడీపీ కృషితో వ‌చ్చిన ఉద్యోగ‌, ఉపాధి క‌ల్పించే కంపెనీలు-సంస్థల‌ ముందు ఫోటోలు దిగి చాలెంజ్‌లు విసిరిన లోకేశ్ తాజాగా కాండోర్ ముందు సెల్ఫీ దిగి మేము తెచ్చిన ప్రఖ్యాత విద్యాసంస్థ ఇది అని తెలిపేందుకు గర్వంగా ఉందని లోకేశ్ అన్నారు.

Advertisement

Next Story