సీబీఎన్-కియా విజ‌న్‌ నిజ‌మైందిలా.. కియా అనుబంధ‌సంస్థల వ‌ద్ద లోకేష్ సెల్ఫీ

by Javid Pasha |
సీబీఎన్-కియా విజ‌న్‌ నిజ‌మైందిలా.. కియా అనుబంధ‌సంస్థల వ‌ద్ద లోకేష్ సెల్ఫీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘క‌ళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు దునియా మొత్తం చూసేశారు. ఆ దూర‌దృష్టి నుంచి వ‌చ్చే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు కాబ‌ట్టే ఆయ‌న‌ని దార్శనికుడు అంటారు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌సముద్రం పంచాయ‌తీలో ఉన్న కియా అనుబంధ సంస్థల మీదుగా సాగింది. వంద‌లాది ఉద్యోగులు లోకేశ్‌కు ఎదురెల్లి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో లోకేశ్ ముచ్చటించారు. కియా అనుబంధ సంస్థల‌లో ఉద్యోగం చేస్తున్న పలువురు ఉద్యోగులు లోకేష్‌తో పాటు కొద్దిదూరంలో పాద‌యాత్రలో నడిచారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ కియా అనుబంధ సంస్థలను చూపిస్తు సెల్ఫీ తీసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నో వ్యయ‌ ప్రయాస‌ల‌ కోర్చి కియాని తీసుకొస్తే క‌మీష‌న్ల కోసం తెచ్చార‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు. కార్లు అమ్ముడుపోని కంపెనీని తెచ్చి ఏం చేస్తార‌ని హేళ‌న చేశారు. అన‌తి కాలంలోనే కియాలో త‌యారైన కార్లు దేశ‌మంతా దూసుకుపోతున్నాయి. కియా అనుబంధ సంస్థలు వేల‌సంఖ్యలో యువ‌త‌కి ఉద్యోగాలు క‌ల్పిస్తున్నాయని లోకేశ్ అన్నారు. ‘‘దిమాగ్ ఉన్న చంద్రబాబు దునియా చూసి తెచ్చిన కియా కంపెనీ ఫ‌లాలు రాష్ట్రానికి అందుతున్నాయి. కియాని విమ‌ర్శించిన వైసీపీ నోర్లే, కియా త‌మ మ‌హామేత లేఖ రాయ‌డం వ‌ల్ల వ‌చ్చింద‌ని ఓ ఫేక్ ఉత్తరం సృష్టించి అసెంబ్లీలో చ‌దివి అల్పసంతోషం మిగుల్చుకున్నారు. కానీ కియా తెచ్చింది చంద్రబాబు అని, టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలుసు’’ అని లోకేశ్ వెల్లడించారు.

Advertisement

Next Story