- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ వ్వవస్థపై మరోసారి విరుచుకుపడ్డ తమిళనాడు సీఎం స్టాలిన్
దిశ, వెబ్ డెస్క్: దేశంలోని గవర్నర్ వ్వవస్థపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారని, తక్కువ వింటారని ఎద్దేవా చేశారు. 'ఉంగళిల్ ఒరువన్' పేరుతో తన ఆత్మకథ పుస్తకం రిలీజ్ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గవర్నర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. ప్రజలు, ప్రభుత్వాలు చెప్పే మాటలను గవర్నర్లు తక్కువగా వింటారని, కానీ ఎక్కువగా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. కాగా యాంటి గ్యాంబ్లింగ్ బిల్లుపై సంతకం చేయకుండా గవర్నర్ ఆ బిల్లును తిరిగి పంపించిన తర్వాత సీఎం స్టాలిన్ చేసిన ఆ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని ఉద్దేశిస్తూ స్టాలిన్ ఈ విమర్శలు చేశారని అర్థమవుతోంది. ఇటీవల జరిగిన అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోని అంశాలు కాకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గవర్నర్ ప్రసంగించారు.
దీంతో క్యాబినెట్ లో చర్చించి నివేదికలోలేని గవర్నర్ ప్రసంగంలోని మాటలను రికార్డు నుంచి తొలగించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ ను ఈ సందర్భంగా స్టాలిన్ ఖండించారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై మోడీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తోందన్న ఆయన.. బీజేపేతర ప్రభుత్వాలను కూలగొట్టేందకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైరయ్యారు. తమిళనాడులో వలసదారులపై దాడులు జరుగుతున్నాయన్న దానిలో ఎలాంటి వాస్తవం లేదన్న ఆయన.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని కొట్టిపారేశారు. ఉత్తర భారత దేశంలోని బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలకు ఇదంతా తెలుసునని అన్నారు. తమిళనాడు అన్నివర్గాల ప్రజలకు నివాసం ప్రాంతం అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.