వైసీపీ కోసం పని చేసిన అధికారులపై టీడీపీ ఉక్కుపాదం.. సీఎం సంచలన నిర్ణయం

by Indraja |
వైసీపీ కోసం పని చేసిన అధికారులపై టీడీపీ ఉక్కుపాదం.. సీఎం సంచలన నిర్ణయం
X

దిశ వెబ్ డెస్క్: ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పని చేయాలి, పార్టీల కోసం కాదు అనే విషయాన్ని గత ప్రభుత్వ హయాంలో మరిచిపోయారు. ప్రజాపాలకులకు ప్రజాసేవకులు తొత్తులుగా మారారు. వైసీపీ ఏది చెప్తే అదే చేసుకుంటూ పోయారని కొందరు ప్రభుత్వ అధికారులపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసేకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి తోత్తులుగా వ్యవహరించిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లిన పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి తన పేషీ నుంచి బయటకు పంపేంచేశారు సీఎం చంద్రబాబు. అలానే తన కోసం శ్రీలక్ష్మి తెచ్చిన బొకే తీసుకోవడానికి సైతం చంద్రబాబు నిరాకరించారు.

ఈ ఘటన జరిగి రెండు రోజులు గడవక ముందే శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం ఎదురైంది. ఏపీ మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో సంతకం పెట్టించేందుకు ఫైల్ తీసుకువెళ్లిన శ్రీలక్ష్మిని, ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివి వద్దంటూ మంత్రి నారాయణ కసురుకున్నారని సమాచారం. కాగా జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదంటూ ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేశారని, ఆమెను బదిలీ చేసేంత వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed