- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ బిగ్ స్కెచ్.. త్వరలో ఎన్డీయే కూటమిలోకి మరో పార్టీ?
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఏకం అవుతున్న విపక్షాకు చెక్ పెట్టడంపై బీజేపీ స్కెచ్ వేస్తున్నది. అంతర్గత కలహాలతో ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా విపక్ష కూటమి వ్యవహారం నడుస్తున్న వేళ పాతమిత్రులను తిరిగి తమ వైపు ఆకర్షించే పనిలో బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా పని చేస్తున్నారు. తాజాగా బిహార్ కు చెందిన ఎల్ జేపీ ఎన్డీయే కూటమిలో చేరబోతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం ఎల్ జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తో కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఈ నెల 18న ఎన్డీయే కూటమి సమావేశానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చిరాగ్ పాశ్వాన్, నిత్యానంద్ రాయ్ ల సమావేశం హాట్ టాపిక్ అవుతున్నది. ఈ భేటీతో రాబోయే లోక్ సభ ఎన్నికల కంటే ముందే ఈ రెండు పార్టీల మధ్య తిరిగి పొత్తు కుదర్చుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రితో చర్చల అనంతరం పార్టీ నేతలతో సమావేశం అయిన పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2024 లోక్‌సభ, వివిధ రాష్ట్రాల ఎన్నికల కోసం తమ పార్టీ ఏదైనా కూటమిలో చేరే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు పార్టీ నాయకులంతా అంగీకరించారని చెప్పారు.