- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి Narottam Mishra షాకింగ్ కామెంట్స్
భోపాల్: మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా శనివారం షాకింగ్ కామెంట్లు చేశారు. బాలీవుడ్ నటి షబానా అజ్మీ, జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాలు స్లీపర్ సెల్ ఏజెంట్లని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల విడుదలపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ బీజేపీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి నరోత్తం మాట్లాడుతూ.. 'బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏదైనా జరిగితే వీరంతా మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం జరిగినా పట్టించుకోరు. రాజస్థాన్‌లో కన్హయ్యలాల్‌ను హత్య జరిగినప్పుడు ఎవరూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. జార్ఖండ్‌లోని దుమ్కాలో ఓ బాలికను సజీవ దహనం చేసినప్పుడూ కూడా వీరు మౌనం వహించారు. బాలీవుడ్ నటి షబానా అజ్మీ, జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాలు 'తుక్డే తుక్డే' గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్లు. చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దీన్ని నాగరికత అనడం ఎంత వరకు కరెక్ట్.' అని ప్రశ్నించారు.