Meal for five rupees: రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు.. ఎప్పటి నుండి అంటే..?

by Indraja |   ( Updated:2024-06-16 08:51:58.0  )
Meal for five rupees: రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు.. ఎప్పటి నుండి అంటే..?
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీ హయాంలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకి వేగంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు.

మూడు వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్‌ వాళ్లతో మాట్లాడగా, తమకే మళ్లీ క్యాంటీన్ల నిర్వాహణ ఇచ్చినట్లైతే, మూడు వారాల్లో 100 క్యాంటీన్లు మాత్రమే ఏర్పాటు చేయగలం అని చెప్పారని మంత్రి నారాయణ తెలిపారు. ఎందుకంటే ఇస్కాన్‌ వాళ్లవి సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నింటిని మూసివేశామని, అక్కడ ఉన్న ఎక్యూప్‌మెంట్‌ని వేరే రాష్ట్రాలకి తరలించామని, వాటిని మళ్లీ తీసుకురావాలంటే తమకు కొంచం సమయం పడుతుందని, కనుక గడువులోపల 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయగలమని, ఆ తరువాత మరో 15 రోజుల్లో మిగతావి ఏర్పాటు చేస్తామని ఇస్కాన్‌ తెలిపిందని నారాయణ పేర్కొన్నారు.కాగా ఈ విషయంపై చర్చిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed