ప్రధాని మోడీకి బిగ్ షాక్.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన నిర్ణయం!

by GSrikanth |   ( Updated:2023-03-30 12:24:40.0  )
ప్రధాని మోడీకి బిగ్ షాక్.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుచేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. అయితే, ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడిన వారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ రాహుల్ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది.

దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కే కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపై కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తాయో చూస్తానని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. 2018లో పార్లమెంట్‌లో ‘శూర్పణఖ’ అంటూ తనపై చేసిన ఆరోపణపై ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం కేసు వేస్తానని రేణుకా చౌదరి చెప్పారు..

Advertisement

Next Story