ఈసీ సంచలన నిర్ణయం.. ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

by GSrikanth |
ఈసీ సంచలన నిర్ణయం.. ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. మొదటి విడుదల చేసిన షెడ్యూల్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెళ్లిల కారణంగా 25వ తేదీకి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో నవంబర్ 23వ తేదీన ఒకేరోజు 50 వేలకు పైగా వివాహాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల తేదీలను మార్చుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ ప్రక్రియ యథాతథంగా డిసెంబర్ 3వ తేదీనే జరపనున్నారు. దీనిపై ప్రధాన పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Advertisement

Next Story