- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: మాజీ సీఎం జగన్ పై తెలంగాణ సీఎం సంచలన వ్యాఖ్యలు
దిశ వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చెప్పినందుకే హైదరాబాద్‌లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు తోలిగించానని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.
ఇలా టీడీపీపై బురదజల్లి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీని ఖతం చేయాలని ప్రయత్నించే చివరికి జగనే ఖతమైయ్యారని ఆయన పేర్కోన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారంటే దానికి జగన్ చేసుకున్న స్వయంకృపరాధమే కారణం అని అన్నారు. పాలనను విస్మరించి, అక్రమాలకు పాల్పడడంతో పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది అని, అందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.
అలానే వైసీపీ నేతలు తనని కలిసినందుకు వారిని జగన్ తిట్టిన సందర్భాలున్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్ ఆనాలోచిత చర్యలకు, అవినీతి, అక్రమాలకు విసిగివేశారిన ప్రజలు జగన్‌ను ప్రతిపక్షంలో సైతం చూడాలని అనుకోలేదని అందుకే 11 సీట్లకే పరిమితమైయ్యారని వైఎస్ జగన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.