రాష్ట్రాన్ని గాలికొదిలి అయోధ్యకు వెళ్తారా?.. ఏక్ నాథ్ షిండేపై సంజయ్ రైత్ ఫైర్

by Javid Pasha |
రాష్ట్రాన్ని గాలికొదిలి అయోధ్యకు వెళ్తారా?.. ఏక్ నాథ్ షిండేపై సంజయ్ రైత్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేపై ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు వర్షాలు, వడగళ్లతో రాష్ట్ర రైతులు అల్లాడుతుంటే అవేమీ పట్టించుకోకుండా అయోధ్యలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ఇలాంటి వాళ్లను రాముడు క్షమిస్తాడా అని ప్రశ్నించారు. బాబ్రీ మసీద్ ఘటన జరిగినప్పుడు బీజేపీ నేతలు పారిపోయారని అన్నారు. రాముడిని తాము కూడా కొలుస్తామని, చాలా సార్లు అయోధ్యకు వెళ్లామని గుర్తు చేశారు. కానీ ఏనాడు బీజేపీ తమతో కలిసిరాలేదని అన్నారు. తమను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం కాపీ కొడుతోందని ఆరోపించారు. ఎవరు అసలు.. ఎవరు నకిలో త్వరలోనే జనాలకు అర్థమవుతుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story