- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రి నిరంజన్ రెడ్డికి భట్టి సవాల్
దిశ, జడ్చర్ల / నవాబుపేట: తనకు పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదని జిల్లాకు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డి అనడం ఆయనలోని అవివేకానికి నిదర్శనమని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాను మరికొన్ని రోజులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నానని దమ్ము ధైర్యం ఉంటే అవసరమైన అధికారులను, సాగునీటి రంగం నిపుణులతో పాటు మరీ ఇంకెవరినైన వారి వెంట తీసుకురావాలని, తాను అవసరం అనుకుంటే ఒకరోజు పాదయాత్ర ఆపైన సరే బహిరంగ చర్చకు సిద్ధమై వస్తానని అన్నారు.
ప్రాజెక్టుల పురోగతిపై వారికి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. పునరావాసం కింద బాధితులకు ఇండ్లకు ఇండ్లు, బడికి బడి, గుడికి గుడి కట్టించవలసి ఉన్నా, వాటిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే వచ్చిన మూడేళ్ల లోపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని నిలదీశారు. రిజర్వాయర్ల నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమిటని అన్నారు. ఇది కాక రాష్టంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పేపర్ లీకేజీల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
నీళ్లు, నిధులు, నియమకాలన్ని సీఎం కేసీఆర్ ఇంటికే చేరాయని అన్నారు. రాష్టం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి వంటి కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏమిటని అన్నారు. బెల్టుషాపులను ప్రోత్సహించడంతో పాటు ధరణి పేరుతో రెవెన్యూ శాఖను అవినీతిమయం చేశారని తెలిపారు. వచ్చే అయిదు నెలల వ్యవధిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే ధరణి వ్యవస్థను రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.