పవన్-చంద్రబాబు భేటీ.. RGV సంచలన ట్వీట్

by GSrikanth |   ( Updated:2023-01-21 14:35:51.0  )
పవన్-చంద్రబాబు భేటీ.. RGV సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌కు.. చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ఇరు పార్టీల అధినేతలు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే, వీరి భేటీపై టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరోక్షంగా విమర్శలు చేశారు. ''కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు'' అని సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్జీవీ ట్వీట్‌పై పవన్ ఫ్యాన్స్, టీడీపీ శ్రేణులు తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు.

Also Read...

NTR : 'నందమూరి తారకరామారావు అనే నేను' ఆ ఘట్టానికి 40 ఏళ్లు

Advertisement

Next Story