- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తేల్చి చెప్పిన ప్రముఖ వైసీపీ మంత్రి..
దిశ వెబ్ డెస్క్: తిన్నంతసేపు విస్తరాకు తిన్న తర్వాత ఎంగిలాకు అన్నట్టు ఉంది వైసీపీ నేతల తీరు. అధికారంలోకి వచ్చే వరకు మీరేఅంతా, అధికారంలోకి వచ్చాక మీరెంత అన్నట్టుగా ఉంది నేతల వైఖరి. అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని తమ గోడు వెల్లబుచ్చుకున్న ప్రజలకు పూచిక పుల్ల విలువ ఇవ్వకుండా మాట్లాడారు వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
అధికారంలో ఉన్న నేతలు కులమత విభేదాలు లేకుండా, తనమన తారతమ్యాలు చూడకుండా ప్రజల సమస్యను పరిష్కరించాలి. అయితే అయ్యా ఇదీ సమస్య, మీరే పరిష్కరించాలని అర్జీ ఇవ్వడానికి టీడీపీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ప్రజలతో కర్కశంగా మాట్లాడారు మంత్రి కారుమూరి. మీ సమస్యలను కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పుకోండి అని మండిపడ్డారు.
మరోసారి వీళ్లతో వస్తే మర్యాదగా ఉండదు అని ధుయ్యబట్టారు. మీరు ఇలా చేయబట్టే మీకు అందాల్సినవి అందడంలేదని తెలిపారు. అయితే కారుమూరిపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి అను వాడు ప్రజలందరిని సమానంగా చూడాలి. అంతేగాని వైసీపీ సానుభూతి పరులను ఒకలాగా, మిగిలిన వాళ్లను మరోలాగా చూడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అధికారంలోకి ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రజలందరూ ఏదో ఒక రూపంలో పన్ను చెల్లిస్తారు. కనుక రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత, వచ్చిన వాళ్లతో మాట్లాడాల్సి అవసరం మంత్రికి ఉంది, అయితే మంత్రి స్థానంలో ఉండి కారుమూరి ఇలా మాట్లడడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కగా కారుమూరి ప్రజలతో నోటికొచ్చినట్టు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.