యాత్ర విషయంలో రాహుల్ గాంధీ ఆ పొరపాటు చేశారా?

by GSrikanth |
యాత్ర విషయంలో రాహుల్ గాంధీ ఆ పొరపాటు చేశారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్రపై రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర గుజరాత్ లేదా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మంగళవారం విదర్భ రాష్ట్ర సాధన కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నుంచి కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి యాత్ర ప్రారంభించి ఉండాల్సిందన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర తమిళనాడులో ఈనెల 7వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తూర్పు మహారాష్ట్ర ప్రాంతానికి రాష్ట్ర హోదా సాధించేందుకు ఈ ప్రాంత ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తూర్పు మహారాష్ట్ర ప్రాంతానికి రాష్ట్ర హోదా సాధించేందుకు వ్యూహాన్ని రూపొందించేందుకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్‌ముఖ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు విదర్భ రాష్ట్రాన్ని ప్రత్యేక స్టేట్ గా కొనసాగించవచ్చని పీకే చెప్పారు. అయితే ఇందుకోసం చేపట్టే ఆందోళనలు కేంద్రం వరకు చేరాలని ఇది జాతీయ స్థాయిలో ప్రభావం చూపేలా ప్రజల్లో నుండి తీవ్ర స్థాయిలో ప్రచారం జరగాలని సూచించారు.



Next Story