Rushikonda: రుషికొండపై వైసీపీ రహస్య నిర్మాణాలు.. ఆ భవనాల్లో ఏముంది? గుట్టురట్టు చేసిన మాజీ మంత్రి..

by Indraja |
Rushikonda: రుషికొండపై వైసీపీ రహస్య నిర్మాణాలు.. ఆ భవనాల్లో ఏముంది? గుట్టురట్టు చేసిన మాజీ మంత్రి..
X

దిశ వెబ్ డెస్క్: అత్యధిక మెజారీటీతో అధికారంలోకి వచ్చాం, శాశ్వతంగా అధికారంలోనే ఉంటాం అని అనుకున్నారేమోగాని నిబంధనలకు విరుద్ధంగా అత్యంత రహస్యంగా రుషికొండపై రాజ భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరోపించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో కలిసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని సందర్శించారు. ఈ నేసథ్యంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేనికీ పనికి రాని నిర్మాణం..

విరుద్ధంగా, అత్యంత రహస్యంగా రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తలపించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుషికొండపై భవనాన్ని నిర్మించారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. సైటు మొత్తం విస్థీర్ణం 61 ఎకరాలు కాగా అందులో 9.8 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారని గంటా అన్నారు. కాగా ఈ భవనంలో మొత్తం ఏడు బ్లాకులు ఉంటాయని, ఒక్కో బ్లాకుకి ఒక్కో పేరె పెట్టారని గంటా పేర్కొన్నారు.

కగా పూర్వీకులు కాలంలో, సద్దాం హుస్సేన్ వంటి వాళ్లు నిర్మించుకున్న భవనాల తరహాలో మాజీ మంత్రి జగన్ ఈ భవనాన్ని నిర్మించారని తెలిపారు. రివ్యూలు, సమీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం ఉందని తెలిపారు. ఒక్కో హాల్‌ను అత్యంత విశాలంగా నిర్మించారని, దీనితో ఈ భవనాన్ని హోటల్‌గా మార్చే అవకాశం సైతం లేకుండా చేశారని మండిపడ్డారు. అలానే , అత్యంత రహస్యంగా ఈ భవన నిర్మాణం ఎందుకు చేశారు అని ప్రశ్నించారు.


కలల సౌదంలోకి కాలు పెట్టకుండా దిగిపోయిన జగన్..

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా.. జగన్మోహన్ రెడ్డి ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న భవనంలోకి కనీసం అడుగు సైతం పెట్టకుండా దిగిపోవాల్సి వచ్చిందని గంటా ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారీటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజల తీర్పును ఎగతాళి చేస్తూ.. పాలన సాగించడం వల్లే 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని, చివరికి కలల సౌదంలోకి అడుగుపెట్టకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చిందని విమర్శించారు.

నియంతను తలపించే జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనా, అలానే పాలనలో అనాలోచిత నిర్ణయాలు, ప్రజా సమస్యలకంటే ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం కారణంగానే, విశాఖను రాజధానిగా చేస్తామన్న విశాఖ వాసులు మాత్రం మీరు వద్దు మీ పాలనా వద్దు అని ఆ ప్రాంతంలోని వైసీపీ నాయకులకి ఘోర పరాజయాన్ని చవిచూపించారని, అలానే ఈ ఘటన ద్వారా విశాఖ రాజధాని వద్దని విశాఖ ప్రజలే జగన్మోహన్ రెడ్డికి తెలియచేశారని గంటా పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ జగన్‌లో మార్పు రాలేదని, అందుకే ఓటమికి గల కారణాలపై సమీక్ష జరపకుండా, ప్రజలపై నిందలు వేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నూతన భవన నిర్మాణానికి టూరిజం రిసార్ట్స్ నాశనం..

గతంలో రుషి కొండపై హరిత రిసార్ట్స్ ఉండేవని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా రిసార్ట్స్ ద్వారా దాదాపు ఏడాదికి ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని ఆయన తెలిపారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్‌ను కూలదోసి, కొండపై ఉన్న పచ్చదనాన్ని నాశనం చేసి, అసత్యాలతో నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మించారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదటగా స్టార్ హోటల్ అని చెప్పిన జగన్ ఆ తరువాత ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని, ఆపై టూరిజం ప్రాజెక్టు అని చెప్పారని మండిపడ్డారు. అలానే ఈ నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేట్లను కూడా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. ప్రజా వేదికను కూల్చి అక్రమ కట్టడం అని పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాన్ని ఏమంటారో కూడా ఆయనే చెప్పాలి అని ప్రశ్నించారు.

మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడని, అటువంటి మూర్ఖుడు రాజు అయితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే అర్థమవుతుందని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. త్వరలో సీఎం చంద్రబాబు విశాఖకు వస్తున్నారని, ఆయనకు ఈ భవనాన్ని చూపించి, అనంతరం ఆయనతో మాట్లాడి నిర్ణయం తీపుకుంటాం గంటా శ్రీనివాసరావు అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed