- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: భార్యాబిడ్డల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన పవన్‌కళ్యాణ్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిఠాపురంలో పవన్‌కళ్యాణ్ పర్యటించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న పిఠాపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఒక తరం కోసం పని చేస్తున్నాని, అలానే మరో రెండు తరాలకు దారి వేసేందుకు నిలబడి ఉన్నాను అని అన్నారు.
ప్రజల కోసం పాతిక సంవత్సరాలు కష్టపడతానని పార్టీ పెట్టినప్పుడే చెప్పానని పేర్కొన్నారు. తనకి 30, 35 సంవత్సరాలు ఉన్నప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. దీనితో తన బిడ్డల ఆలనాపాలనా చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనని ఓ ఇంటర్యూలో మీ బిడ్డల భవిష్యత్ చూసుకున్నారా అని అడగగా, తాను తెలియదని చెప్పినట్టు తెలిపారు.
అలానే తన తండ్రి తనకి ఆస్తిపాస్తులు ఇవ్వలేదని, కేవలం చదువుకోమని చెప్పారని, ధర్మం వైపు నిలబడమని చెప్పారని, తాను తన తండ్రి మాట ప్రకారమే నడుచుకుంటున్నట్టు పేర్కొన్నారు. ధర్మో రహిత రహిత అనే సూత్రానికి కట్టుబడి, దశాబ్ధాలుగా ధర్మం వైపు నిలబడి ఉన్నానని, అయినా దెబ్బలు తిన్నాను, భూతులు తిన్నాను చివరికి తన భార్యను కూడ తిట్టారని వాపోయారు.
తన భార్య విదేశీరాలని, ఈ దేశం రాజకీయం అర్థంకాదని, ఎందుకు ఇలా ఇంట్లో ఉండేవారిని తిడుతున్నారని అడిగిందని తెలిపారు. అలానే ఆమె భయపడిందని, ఇబ్బందిపడిందని, దీనితో ఆమెను క్షమించమని అడిగాను అంటూఎమోషనల్ అయ్యారు. అసలు నీకు ఈ రాజకీయాలు ఎందుకు అని ఆమె అడిగిందని, అందుకు సమాధానంగా ధైర్యం కోల్పోయిన ఎంతో మంది బిడ్డలకు అండగా ఉన్నానని, 13వ తేదీ పిఠాపురంలో జరిగే ఎన్నికలకు రా, నేను ఎందుకు నిలబడ్డానో తెలుస్తుంది అని తన భార్యకు చెప్పినట్టు పేర్కొన్నారు.
Read More..
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పిఠాపురం ప్రజలకు ప్రభాస్ పెద్దమ్మ కీలక మెసేజ్ (వీడియో)