- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 విపక్షాల ప్రధాని అభ్యర్థిపై కేసీఆర్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీని రాజకీయ పరంగా ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్ సీఎం నితీష్‌తో భేటీ అయ్యారు. అయితే, గురువారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ 2024 పీఎం అభ్యర్థిపై ఎవరనే ప్రశ్నను దాటవేస్తూ సమాధానం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థికగా ఎవరు పోటీ చేయనున్నారన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
2024 ప్రధాని అభ్యర్థి విషయంపై ప్రతిపక్షాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ పీఎం పదవికి పోటీచేసే అభ్యర్థా? అన్న ప్రశ్నను కేసీఆర్ దాటవేశారు. అంతేకాకుండా విలేకరుల సమావేశంలో ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నించినా నితీష్ మాత్రం ఆయన్ను అడ్డుకున్నారు.
Also Read : KCR:కేసీఆర్ సారు మీకు ఇన్ని అవమానాలా!