- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పేరు ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అనౌన్స్ చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. అవినీతి నిర్మూళన కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ జెండా, అజెండాను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.
కాగా, గతకొన్ని రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. పార్టీ పేరు ఇదే అంటూ పలు మీడియా ఛానళ్లలో అనేక వార్తలు ప్రచురితమయ్యాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ విజయ్ ఇవాళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. మరి ఆయన ఎంట్రీ దేశ, తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.