యుద్ధం చెయ్యాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం.. పవన్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్‌

by sudharani |   ( Updated:2023-07-06 15:45:35.0  )
యుద్ధం చెయ్యాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం.. పవన్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. వారాహి విజయ యాత్రలో పాల్గొంటూనే.. సమయం కుదిరినప్పుడల్లా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే.. ఉభయ గోదావరి జిల్లాలో ప్రసంగాలతో దూసుకుపోతున్నారు పవన్. అయితే.. ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మిగతా హీరోల అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా మల్టీస్టారర్ ఫ్యాన్స్ అందరూ పవన్ కల్యాణ్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు. ‘యుద్ధం చెయ్యాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం’ అంటూ ప్లకార్డ్‌లు పట్టుకుని వారాహి విజయ యాత్రలో పాల్గొంటున్నారు.

Advertisement

Next Story