AP Politics: నారా లోకేష్ Vs వైఎస్ జగన్.. ఎవరు నేరస్తులు..? హీటెక్కిన ట్వీట్ వార్..

by Indraja |
AP Politics: నారా లోకేష్ Vs వైఎస్ జగన్.. ఎవరు నేరస్తులు..? హీటెక్కిన ట్వీట్ వార్..
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు వెళ్లారు. అక్కడ ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండింగ్‌లో ఉన్న పిన్నెల్లిని కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ టీపీడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం చంద్రబాబు ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా, కేవలం భయాదోళలనలను సృష్టించాలి, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలి, దొంగ కేసులు పెట్టి ఇరికించాలి, ఆస్తులను ధ్వంశం చేయాలి, వైసీపీ కార్యకర్తలను, అభిమానులను, ఓటు వేసిన వారిపై కక్ష సాధించేలా అడుగులు వేయడం అత్యంత హేయమైన రాజకీయం అని ఆయన మండిపడ్డారు. అలానే పిన్నెల్లిపై అక్రమంగా కేసులు పెట్టారని, ఈ విషయాన్ని ఒకసారి అందరూ ఆలోచించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టడంలో తప్పులేదన్నారు. అందుకే ఆ కేసులు అతనికి కోర్టు బెయిల్ ఇచ్చిందని, అయితే పిన్నెల్లి రిమాండ్‌లో ఉండడానికి కారణం టీడీపీ అక్రమంగా పెట్టిన కేసు అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్‌ పెట్టుకుని దాడులు, వేధింపులకి దిగుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. మరీ ఇంత దారుణమా? ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదని గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు.

కాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని వైసీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఆ పోస్ట్‌పై తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పంధించారు. ‘డాక్టర్. సుధాకర్‌‌ను చంపింది ఎవరు? ప్రజా వేదికను కూల్చింది ఎవరు?బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్‌ని చంపింది ఎవరు? ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేసింది ఎవరు?అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు?

టిడిపి కార్యకర్త చంద్రయ్యని చంపింది ఎవరు?’ అని ప్రశ్నించారు.‘ రూ.25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు సమాధానం చెప్పాలి’ అని ట్విట్టర్ వేదికగా కోరారు.

Advertisement

Next Story

Most Viewed