- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం: MLC కవిత
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని.. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి! అంటూ ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది?.. మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేస్తిరి కదా? అంటూ ఆమె ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ఆమె నిలదీశారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని అన్నారు. ‘ఈరోజు భారతదేశంలో వాస్తవం ఏంటంటే నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు. కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉంది. యువత పట్ల ఏమైనా ఆందోళన ఉందా? లేదా? యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కృషి ఏమైనా చేస్తున్నారా?’అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
Unemployment rate is at 7.8%, a 3 month high !
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2023
But is there any concern or effort to utilise the potential of young people?
The fact of the matter in today’s India is that - people with real degrees get no job and a person with no degree has the top job.