- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ను విమర్శించే దమ్ముందా?: పవన్ కల్యాణ్కు మంత్రి రోజా సవాలు
దిశ, వెబ్ డెస్క్: వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఆర్కే రోజా ఖండించారు. వాలంటీర్లు మహిళలను అక్రమ రవాణాలో వాలంటీర్లు కీలకంగా ఉన్నారని పవన్ మాట్లాడటం దారుణమని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు, మిస్సింగ్ మధ్య ఉన్న తేడా పవన్ కల్యాణ్ తెలియదని ఎద్దేవా చేశారు. మహిళల అక్రమ రవాణా కేసులకు సంబంధించి దేశంలోని టాప్ పది రాష్ట్రాల్లో ఏపీ లేదనేది పవన్ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ లిస్టులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను పవన్ కల్యాణ్ ఇదే విధంగా విమర్శించగలరా అని సవాలు విసిరారు.
కేసీఆర్ ను ఒక్కమాట అన్న తనను హైదరాబాద్ లో ఉండనీయరనే విషయం పవన్ కు తెలుసునని, కేసీఆర్ ను ఒక్కమాట అన్నా పవన్ కల్యాణ్ తాట తీస్తారని సంచలన మంత్రి రోజా అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి బ్రిటన్, కేరళ ప్రభుత్వాలు పొగిడాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో వాలంటీర్లు బాగా కృషి చేస్తున్నారని చెప్పారు. తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.