- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే
దిశ, వెబ్ డెస్క్: ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తమత టచ్ లో ఉన్నారని మహారాష్ట్ర సీఎం, శివసేన వ్యతిరేక వర్గం నేత ఏక్ నాథ్ షిండే అన్నారు. శివసేన పార్టీ, పార్టీ గుర్తు తమ వర్గానికే చెందిందంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందన్న ఆయన.. ఉద్ధవ్ వర్గంలోని ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతు పలకాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఉన్నదే ఒక్కటే శివసేన పార్టీ అని, అది తమ పార్టేనని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో తమ పార్టీ తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించకుంటే రెండు వారాల్లో ఏం చేయాలో అది చేస్తామంటూ శివసేన చీఫ్ విప్ భరత్ గొగావాలే ఉద్ధవ్ వర్గాన్ని హెచ్చరించారు.
పార్లమెంట్ లో కూడా శివసేనకు చెందిన ప్రస్తుత చీఫ్ విప్ ను తొలగించి ఆ స్థానంలో త్వరలోనే కొత్త వ్యక్తిని ఎన్నుకుంటామని, ఆ బాధ్యతలు సీఎం ఏక్ నాథ్ షిండే తీసుకుంటారని చెప్పారు. నేడో రేపో తమ ప్రభుత్వం కూలిపోనుందని ఆదిత్య థాక్రే ప్రలాభాలు పలుకుతున్నారని, కానీ ఏడు నెలలుగా ఎలాంటి సమస్య లేకుండా తాము అధికారంలో కొనసాగుతున్నామని చెప్పారు. రేపో మాపో తమ ప్రభుత్వం కూలిపోవడం కాదని, ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో చాలా మంది తమతో జాయిన్ అవుతారని అన్నారు. తమ ప్రభుత్వా్న్ని కూల్చడం ఉద్ధవ్ వల్ల కాదని, ఇదే విషయం ఎన్సీపీ నేత శరద్ పవార్ ఉద్ధవ్ కు చెప్పారని గుర్తు చేశారు.
కాగా శివసేన పార్టీ, పార్టీ బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రియించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాదనలు విన్న కోర్టు.. ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని షిండే వర్గం చెబుతుండగా.. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ షిండే అధికారంలోకి వచ్చారని, తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కూడా రాజ్యాంగ విరుద్ధమని ఉద్ధవ్ వర్గం వాదిస్తోంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఉద్ధవ్ వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.