- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: బీసీ బిడ్డపై సీఎం జగన్ కుట్ర.. అచ్చెన్నాయుడు
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనుమానితులుగా ఉన్న ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చెయ్యగా.. వాళ్ళల్లో సతీష్ అనే యువకుడు తానే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినట్టు ఒప్పుకున్నారని, అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా సతీష్‌ను అరెస్ట్ చేయడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్‌పై జరిగిన దాడిలో బీసీ బిడ్డను ఇరికించేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో కోడికత్తి డ్రామాలో ఎస్సీ బిడ్డను 5ఏళ్ళు జైలు పలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ బిడ్డపై కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే జగన్‌పై దాడికి టీడీపీ సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. కత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత వహించాలి అని వైసీపీ అధినేత జగన్ చెప్పారని.. కనుక ఇప్పుడు అధికారంలో ఉంది వైసీపీ కనుక వాళ్ళే భద్యత వహించాలని డిమాండ్ చేశారు.