కర్ణాటక రిజల్ట్స్ : ముందంజలో కాంగ్రెస్.. ఇక ఫోకస్ అంతా సీఎం క్యాండిడేట్‌పైనే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-13 07:51:54.0  )
కర్ణాటక రిజల్ట్స్ : ముందంజలో కాంగ్రెస్.. ఇక ఫోకస్ అంతా సీఎం క్యాండిడేట్‌పైనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం సీఎం క్యాండిడేట్ ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్యే పోటీ నెలకొంది. వీరిద్దరు కర్ణాటక రాజకీయాల్లో ఆదరణ పొందిన నేతలుగా పేరుగాంచారు. కాగా 75 ఏళ్ల సిద్ధరామయ్య ఇదే తన చివరి పోటీ అని క్లారిటీ ఇచ్చారు. 120 సీట్ల కన్నా ఎక్కవే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన కొడుకు తన తండ్రిని సీఎంగా చూడాలనుకుంటున్నట్లు ఇప్పటికే మీడియాతో అన్నారు. అయితే ఓ చానల్ నిర్వహించిన సర్వేలో సిద్ధరామయ్య సీఎం కావాలని కర్ణాటక ప్రజలు కోరుకున్నారు. సిద్ధరామయ్య 1983లో తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టారు.

1994లో ఆయన డిప్యూటీ సీఎంగా జనతాదల్ ప్రభుత్వంలో పనిచేశారు. పది సంవత్సరాల తర్వాత 2004లో జనతాదల్ (సెక్యులర్) ప్రభుత్వంలో పనిచేశారు. ఆ పార్టీ చీఫ్ దేవే గౌడతో విభేదాల కారణంగా పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. రెండేళ్ల తర్వాత 2008లో కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య చేరారు. 2013 కర్ణాటక ఎన్నికల తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యారు. అయితే ఈ సారి ఎన్నికల సందర్భంగా ఆయన బొమ్మైపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. లింగాయత్ చీఫ్ మినిస్టర్ అవినీతి పరుడు అనడం వివాదాస్పదమైంది. అయితే లింగాయత్ కమ్యూనిటీని తాను ఏం అనలేదని క్లారిటీ ఇచ్చారు. బస్వారాజ్ బొమ్మై మాత్రం లింగాయత్ కమ్యూనిటీ మొత్తాన్ని సిద్ధరామయ్య అవమానించారని ఎన్నికల క్యాంపెయిన్ లో ఆరోపించారు. అవేవి బీజేపీకి కలిసి రాలేదు.

పోటీ ఆయనతోనే..

అయితే తనకన్నా 14 ఏళ్లు చిన్నవాడైనా కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ అధికారంలోకి వస్తే తనకు టాప్ పదవి కావాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 61 ఏళ్ల శివకుమార్ కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచారు. కర్ణాటకలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా ఎదిగారు. అయితే ఆయన సారథ్యంలో 2019లో జనతాదల్‌తో పొత్తులో భాగంగా ఏర్పడిన ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే కూలిపోయింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు కాంగ్రెస్‌తోనే తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

శివకుమార్ గతంలో అవినీతి కేసుల్లో చిక్కుకుని తీహార్ జైలు ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. 2017లో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో విచారణ ముమ్మరంగా సాగింది. సిద్ధరామయ్యకు, డీకే. శివకుమార్‌కు పవర్ ఫుల్ నేతలుగా కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి భారీగా ప్రజల మద్ధతు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ముందే ప్రకటిస్తే ఎన్నికల ఫలితాలపై ఎఫెక్ట్ పడుతుందని కాంగ్రెస్ జాగ్రత్త పడింది. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో వీరిద్దరిలో ఎవరిని సీఎంగా కాంగ్రెస్ ప్రకటిస్తుందనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read...

గెలిచింది కాంగ్రెస్.. ఓడింది మోడీ


Advertisement

Next Story