NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్?

by GSrikanth |   ( Updated:2022-09-03 15:02:39.0  )
NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారని అందువల్లే జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ సీఎం టార్గెట్ చేశారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా వ్యవహారం సాగుతున్న వేళ ఈ వివాదానికి ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ అగ్గి పోసినట్లుగా వ్యవహించారనే టాక్ తెరపైకి వస్తోంది. కళ్యాణ్ రామ్‌కు ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో సొంత బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్విట్టర్‌లో సింగిల్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సింగిల్ వర్డ్‌తో ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో 'ఫియర్' అనే పోస్ట్ ఇప్పుడు దర్శనం ఇవ్వడం దుమారం రేపుతోంది. ఈ పోస్టు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి చేశారనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో నిప్పు మీద ఉప్పు పోసినట్లుగా నివురుగప్పిన నిప్పులా మారిన టీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వ్యవహారం మధ్యలో ఎన్టీఆర్ ఆర్ట్స్ చేసిన ట్వీట్ మంటలు పుట్టిస్తోంది. ఈ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలియకపోయినా అది కేసీఆర్‌ను ఉద్దేశించే చేశారనే విమర్శలు తారా స్థాయికి చేరాయి.

జూనియర్ ఎన్టీఆర్‌పై కేసీఆర్ ఆగ్రహం?:

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. దీన్ని తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేయనున్నారు. అమితాబచ్చన్, కింగ్ నాగార్జున వంటి స్టార్స్ యాక్ట్ చేసిన ఈ మూవీని సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు మొత్తం 5 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో జరపాలని నిర్ణయించారు. అయితే, వినాయక చవితి బందోబస్తు ఉన్న కారణంగా మీ ఈవెంట్‌కు సెక్యూరిటీ కల్పించలేమని పోలీస్ శాఖ అనుమతులు రద్దు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్‌తో కార్యక్రమాన్ని సరిపెట్టుకున్నా పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారనే కారణంతోనే కేసీఆర్ ఈ ప్రోగ్రామ్‌కు పర్మిషన్ రద్దు చేశారనే టాక్ వినిపించింది. ఇటీవల అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ కావడాన్ని జీర్ణించుకోలేకే ఇలా ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ సింగ్నల్స్ ఇచ్చారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ట్విట్టర్ ఖాతాలో 'ఫియర్' అనే మెసేజ్ పోస్ట్ కావడం మరింత దుమారానికి కారణం అవుతోంది. ఈ ట్వీట్ వెనుక టార్గెట్ కేసీఆరే అని కొందరు అంటున్నారు. తానే నేరుగా స్పందించకుండా తన అన్నకు చెందిన సంస్థ ట్వీట్ ద్వారా ఇలా ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారా లేక ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నుండి ఇదేమైనా అప్ డేటా అనే సంగతి అర్థం కాక నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

ఫ్యాన్స్‌కు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పిన Jr.NTR

ఛాలెంజ్ స్వీకరించాలి.. మెగాస్టార్ చిరుకు ఝలక్ ఇచ్చిన Jr.NTR

Advertisement

Next Story

Most Viewed