- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP politics: బ్రహ్మన్న కు బ్రహ్మ రథం.. భారీ ర్యాలీ తో నామినేషన్
దిశ మాచర్ల.: మాచర్ల ఎన్డీయే కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మ రెడ్డికి జనం నీరాజనాలు అర్పించారు. బుధ వారం నామినేషన్ వేసేందుకు బ్రహ్మరెడ్డి భారీ ర్యాలీతో బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9.30.కే ఆయన మాచర్లకు చేరి, అక్కడ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీగా బయలు దేరారు.
మండాది రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ 4 గంటల పాటు సాగింది. నామినేషన్‌కు హాజరైన ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పలు పలు ప్రాంతాలలో భోజన వసతి నిర్వాహకులు ఏర్పాటు చేసారు. ర్యాలీకి హాజరైన జనంతో పట్టణంలోని ప్రధాన మార్గాలన్ని కిటకిటలాడాయి. బ్రహ్మ రెడ్డి నామినేషన్‌కు హాజరయ్యేందుకు ఉదయం నుండే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.
మేయిన్ రోడ్డ లో సాగిన ర్యాలీలో దారి పొడవునా బ్రహ్మ రెడ్డికి జనం జేజేలు పలికారు. టపాసుల మోతతో, డీ.జ్.వాయిద్యాలతో మాచర్ల దద్దరిల్లింది. ర్యాలీలో బ్రహ్మరెడ్డితోపాటు ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావు, షరీఫ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ జరిగింది. మొత్తం మీద మాచర్లలో బ్రహ్మ రెడ్డికి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.