- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 రోజుల పాటు ‘జై భారత్ సత్యాగ్రహం’: కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ రానున్న 30 రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘జై భారత్ సత్యాగ్రహం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇందులో భాగంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.
ఇక అదానీ స్కామ్ పై విచారణ కోసం జేపీసీ వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా లోక్ సభ స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఈ విషయమై ఇవాళ రాత్రి ఏడు గంటలకు ‘లోక్ తంత్ర బచావో మశాల్ శాంతి మార్చ్’ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రకోట నుంచి టౌన్ హాల్ వరకు సాగే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు.