ఐఎన్‌ఎస్ విక్రాంత్ విజన్‌ అన్ని ప్రభుత్వాల సమిష్టి కృషి : Jairam Ramesh

by srinivas |   ( Updated:2022-09-02 14:47:55.0  )
ఐఎన్‌ఎస్ విక్రాంత్ విజన్‌ అన్ని ప్రభుత్వాల సమిష్టి కృషి :  Jairam Ramesh
X

దిశ,వెబ్‌డెస్క్: కొచ్చి షిప్ యార్డ్ లో భారత నావికా దళం కొత్త చిహ్నం గుర్తును ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. ఐఎన్‌ఎస్ విక్రాంత్ విజన్‌ని నిజం చేసిన ఎన్నో ఏళ్ల కృషికి భారత నావికాదళానికి, నేవల్ డిజైన్ బ్యూరోకు, కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక, విక్రాంత్ భారతదేశ సముద్ర భద్రతకు ఒక ముఖ్యమైన అడుగు అని ట్వీట్ చేశారు.

కాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధానిని విమర్శించారు. 1999 నుండి అన్ని ప్రభుత్వాల సమిష్టి కృషిని ఆయన అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. "ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఒక భారీ విజయం, అయితే ఇది 22 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మొదటి వాజ్‌పేయి ప్రభుత్వం ఆ తర్వాత మన్మోహన్‌ ప్రభుత్వం, ఆ తర్వాత మోదీ ప్రభుత్వం కొనసాగించింది'' అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed