- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాంపేట్ లో రూ. 2 వేల కోట్ల కుంభకోణం: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 2 వేల కోట్ల భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. బాచుపల్లి మండలంలోని నిజాంపేట్, బాచుపల్లి లోని కబ్జాలకి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ఆయన స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు 10 నుంచి 12 సర్వే నంబర్స్ లో ఉన్న ప్రభుత్వ స్థలాలను 58, 59 జీవో ల ముసుగులో కబ్జా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు.
ప్రభుత్వ స్థలాలలో సుమారు వెయ్యి ఓపెన్ ప్లాట్స్ కు తప్పుడు పత్రాలు సృష్టించి లేని ఇళ్లు ఉన్నట్లుగా చూయించి వాటికీ నకిలీ కరెంట్ బిల్లులు, పంచాయతీ టాక్స్ పెట్టి 58, 59 జీవో దరఖాస్తులు చేశారని, రాష్ట్రంలో ఇదీ పెద్ద స్కాం అని ఇందులో లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ భర్త ప్రమేయం ఉందని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు కుడి భుజం, ఎడమ భుజం అని గొప్పలు చెప్పుకునే ఆ ఇద్దరూ ప్రజా ప్రతినిధులు, మేయర్ భర్త ఉండడం విస్మయం కలిగిస్తుందని అన్నారు. ఇక్కడి భూ కబ్జాపై ప్రభుత్వం విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.