తాజా పరిణామాలతో హై టెన్షన్! కర్ణాటక సీఎం ఎవరు?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-15 04:56:50.0  )
తాజా పరిణామాలతో హై టెన్షన్! కర్ణాటక సీఎం ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీఎం ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం ఎంపిక బాధ్యతను సీఎల్పీ అధిష్టానానికే వదిలేసింది. పార్టీ హై కమాండ్ కర్ణాటకలో ఎమ్మెల్యేలు, డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గంతో భేటీకి సుశీల్ కుమార్ షిండే టీంను పంపింది. ఈ టీం ఇప్పటికే కొత్త ఎమ్మెల్యేలతో రాత పూర్వకంగా అభిప్రాయాన్ని తీసుకుంది. 135 మంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే సుశీల్ కుమార్ షిండే టీం భేటీ పూర్తయింది. కాసేపట్లో బెంగళూరు నుంచి ఢిల్లీకి షిండే కమిటీ చేరుకోనుంది.

ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ కమిటీ నేతలు స్వీకరించగా వాటిని అధిష్టానానికి సమర్పించనున్నారు. బుధవారం లేదా గురువారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేలతో పరిశీలకుల భేటీ ముగియడంతో వారి నివేదిక ఎలా ఉండబోతోందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలతో షిండే టీం విడివిడిగా భేటీ కావడం, పార్టీ హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపనుందనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story