- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
EVM మిషన్లను ఈజీగా హ్యాక్ చేయొచ్చు.. ప్రపంచ కుబేరుడి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా మస్క్ ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నేనొక టెక్నాలజిస్ట్‌గా చెబుతున్నా.. ఓట్ వేసే ఈవీఎం(EVM) మిషన్లను ఈజీగా హ్యాక్ చేయచ్చు. కంప్యూటర్ ప్రొగ్రామ్(Computer program)ల గురించి నాకు బాగా తెలుసు.
నిత్యం వాటిపైనే అధ్యయనం చేస్తాను. మెషీన్ల గురించి నాకు ఎవరో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు’ అని ఎలన్ మస్క్ అన్నారు. దీంతో ఈవీఎమ్ మిషన్లపై సర్వత్రా అనుమానం నెలకొంది. ఇప్పటికే భారత్‌లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని పలు పార్టీల నేతలు ప్రత్యక్షంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మస్క్ వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఎలాన్ మస్క్ సృష్టిస్తున్న సంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్ దగ్గరకే చేర్చి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.