Former CM Jagan to Central Jail: మరికాసేపట్లో సెంట్రల్ జైలుకు మాజీ సీఎం జగన్..

by Indraja |   ( Updated:2024-07-04 07:21:11.0  )
Former CM Jagan to Central Jail: మరికాసేపట్లో సెంట్రల్ జైలుకు మాజీ సీఎం జగన్..
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని, ఈవీఎంను ధ్వంశం చేశారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పలు కేసులు నయోధయ్యాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో జుడిష్యల్ కస్టడీలో ఉన్నారు. కాగా ఆయన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు.

అయితే ఎన్నికల సమయంలో పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టుతుండాగా రికార్డైన వీడియో అని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో అటు కూటమి పార్టీ నేతలు, ఇటు ప్రజలు సైతం పిన్నెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పిన్నెల్లి ఈవీఎంలను పగలగొట్టం అటుంచితే అసలు ఆ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు ఎలా వచ్చిందని మాట్లాడడం, ఇప్పుడు ఏకంగా జకగ్ జైలుకు వెళ్లి పరామర్శించడానికి సిద్దపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story