సీఎం చంద్రబాబు తన ధోరణి మార్చుకోకుంటే.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. జగన్

by Indraja |   ( Updated:2024-07-04 08:30:03.0  )
సీఎం చంద్రబాబు తన ధోరణి మార్చుకోకుంటే.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. జగన్
X

దిశ వెబ్ డెస్క్: నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లి రామకృష్టా రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల రూ.1500 ఇస్తాను అని చెప్పావు ఏవి ఆ రూ.1500 అని రాష్ట్రంలో ఉన్న మహిళలు అడుగుతున్నారని, కనుక వాటిపైన ద్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు చేయాలి అని జగన్ సూచించారు.

ఇవేమీ చేయకుండా కేవలం భయాదోళలనలను సృష్టించాలి, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలి, దొంగ కేసులు పెట్టి ఇరికించాలి, ఆస్తులను ధ్వంశం చేయాలి, వైసీపీ కార్యకర్తలను, అభిమానులను, ఓటు వేసిన వారిపై కక్ష సాధించేలా అడుగులు వేయడం అత్యంత హేయమైన రాజకీయం అని ఆయన మండిపడ్డారు. అలానే పిన్నెల్లిపై అక్రమంగా కేసులు పెట్టారని, ఈ విషయాన్ని ఒకసారి అందరూ ఆలోచించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

ఎన్నికలు అయిపోయిన తరువాత కారంపూడిలో ఘర్షణాయుత ఘటన చోటు చేసుకుంది, దీనికి కారణం టీడీపీ అని పేర్కొన్నారు. టీడీపీ ఆకృత్యాలకు ఒక ఏస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి డిఎప్పీ అనుమతితో కారంపూడికి వెళ్లిన పిన్నెల్లిని ఊరి పొలిమేరలోనే అడ్డుకున్నారని, అక్కడ గొడవ జరిగిందని, అయితే ఆ సమయంలో సీఐ నారాయణ స్వామి, పిన్నెల్లి ఒకరికొకరు తటస్థపడలేదని, కనీసం ఒకరినొకరు చూసుకున్న దాఖలాలు సైతం లేవని, ఊరికి ఆ చివరణ సీఐ ఉంటే, ఈ చివరణ పిన్నెల్లి ఉన్నారని, అయితే జరిగిన గొడవలో బహుశా ఏదైనా చిన్న రాయి సీఐకి తగలి ఉండవచ్చు అని జగన్ అన్నారు.

అయినా అతను మెడికో లీగల్ కేసు సైతం పెట్టలేదన్నారు. కాని 9 రోజుల తరువాత హత్యాయత్నం కైసు పెట్టారు అని, నిజంగా ఆ ఘటన జరిగి ఉంటే.. మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదని, అలానే కేంద్ర ఎన్నికల బృందం ఏర్పాటు చేసిన సిట్ మే 17 నుండి మే 20 వరకు రాష్ట్రంలో విధ్వంసకర ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో తిరిగి ఘటనలకు సంబంధించి ఇచ్చిన రిపోర్ట్‌లో ఈ అంశం ఎందుకు రాలేదు అని జగన్ ప్రశ్నించారు.

పోలింగ్ బూత్‌లో అన్యాయం జరిగింది కనుకే పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టారని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. అందుకే ఈవీఎం కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరైందని, కాని అతనిపై అన్యాయంగా హత్యాయత్నం కేసుపెట్టారని, అందుకే అతను జైల్లో ఉన్నట్టు తెలిపారు. నారా లోకేష్‌తో పాటు టీడీపీ కార్యకర్తలు సైతం రెడ్ బుక్ పట్టుకుని ఉన్నారని, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని ఇలానే చేస్తూపోతే ఎవరు ఉపేక్షించరని, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తన ధోరణి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు.

Advertisement

Next Story