- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: ఎన్నికలపై ఉత్కంఠ రేపుతున్న నామినేషన్లు.. మరీ ఇంతలానా?
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు ఉత్కంఠను నెలకొలుపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 124 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాగా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ప్రముఖ పార్టీల అభ్యర్థులతోపాటుగా అధిక సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థుల నుండి కూడా నామినేషన్లు ధాఖలైయ్యాయి.
కాగా ప్రముఖ పార్టీల నుండి ఎన్నికల బరిలో ఉన్న కీలక అభ్యర్థుల విషయానికి వస్తే.. అమలాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. అలానే ఏలూరి నుండి కారుమూరి సునీల్ వైసీపీ తరుపున ప్రత్యర్థులతో తలపడనున్నారు. ఇక మచిలీపట్నం నుండి వల్లభనేని అనుదీప్ జనసేనాని కోసం ఎన్నికల బరిలోకి దిగారు.
కాగా ఒంగోలు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేసేందుకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి సిద్ధమయ్యారు. అలానే నెల్లూరులో వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా కడప ఎంపీ రాజకీయం కాకపుట్టిస్తోంది. కడప ఎంపీ ఎన్నికల బరిలో వైసీపీ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల బరిలో ఉండగా.. కాంగ్రెస్ తరుపున ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆయనతో తలపడనున్నారు.