గుజరాత్ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. వచ్చేవారం రాష్ట్రంలో పర్యటన

by GSrikanth |
గుజరాత్ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. వచ్చేవారం రాష్ట్రంలో పర్యటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ రాష్ట్రంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వెళ్లనుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే సహా ఈసీ ఉన్నతాధికారులు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని సీనియర్ అడ్మినిస్ట్రేటివ్, పోలీసు అధికారులతో కూడా సమావేశమై ఎన్నికల సన్నాహాలను సమీక్షించి తదుపరి చర్యలపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.

Advertisement

Next Story