బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్కు డీఎస్ రాజీనామా

by Javid Pasha |   ( Updated:2023-03-27 11:46:55.0  )
బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్కు డీఎస్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ రాజకీయ నాయకుడు డీఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన భార్య విజయలక్ష్మి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఇక డీఎస్ కాంగ్రెస్ కు రాజీనామా లేఖ రాస్తున్న వీడియోను కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కాగా నిన్న బీఆర్ఎస్ ను వీడి పెద్ద కుమారుడు సంజయ్ తో కలిసి కాంగ్రెస్ లో చేరిన డీఎస్.. 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అయితే కాంగ్రెస్ లో డీఎస్ చేరిక వాళ్ల కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. డీఎస్ చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీలో క్రియాశీల నేతగా ఉన్నారు. ఇక పెద్ద కుమారుడు సంజయ్ తో కలిసి తండ్రి డీఎస్ కాంగ్రెస్ లో చేరడాన్ని అర్వింద్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story