- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీ తరహాలో మరో ఎంపీపై అనర్హత వేటు
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత మరో ఎంపీపై వేటు పడింది. యూపీలో 2005 నాటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌కు సంబంధించి కిడ్నాప్ మరియు హత్య కేసులో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ దోషిగా తేలడంతో ఆయన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ కేసులో అఫ్జల్ అన్సారీని దోషిగా తేలడం కంటే ముందే అతడి సోదరుడు ముఖ్తార్ అన్సారీని యూపీలోని ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన కొన్ని గంటల తర్వాత అతని సోదరుడైన బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ను కూడా ఈ కేసులో దోషిగా తేల్చి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో అఫ్జల్ అన్సారీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
పార్లమెంటు నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడిన సభ్యుడు ఆటోమెటిక్‌గా అనర్హుడిగా ప్రకటించబడతారు. 2019 నాటి కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. రాహుల్ గాంధీ తర్వాత అదే రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న మరో ఎంపీ జాబితాలో అఫ్జల్ అన్సారీ నిలిచారు. కోర్టు నిర్ణయంపై దివంగత బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ భార్య అల్కా రాయ్ స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లో మాఫియా పాలన అంతమైందని, తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పారు.